మానుగూరు, 2026-11-21
మణుగూరు మండలం తోగూడెం గ్రామంలో భూమి వివాదం కారణంగా సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనకు ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు చెల్లించకుండా మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి ఆ భూమిని వేరొకరికి విక్రయించి మోసం చేశారని ఆయన ఆరోపించారు.

ఈ విషయంపై గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతూ, నలుగురు వ్యక్తులతో కలిసి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, సురేష్‌కు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దిగారు. అనంతరం పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.